: యూపీ సీఎం యోగిపై ఫేస్ బుక్ లో అభ్యంతరకర పోస్ట్... యువకుడి అరెస్ట్


యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో అభ్యంతరకర పోస్టును పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రేటర్ నోయిడాకు చెందిన 22 ఏళ్ల రహత్ ఖాన్ అనే యువకుడు ఈ పోస్ట్ పెట్టాడు. ప్రజా వినియోగ కేంద్రం నడుపుతున్న రోహిత్ మార్ఫింగ్ చేసిన యోగి ఫొటోలను అప్ లోడ్ చేశాడు. దీంతో, రహత్ పై ఐటీ చట్టంలోని 66ఏ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

అయితే, తన కుమారుడు అమాయకుడని, అతడిని కుట్ర పూరితంగా కేసులో ఇరికించారని అతని తల్లీ మున్నీ ఆరోపించారు. తన కుమారుడి ఫేస్ బుక్ పాస్ వర్డ్ దొంగిలించి, సీఎంకు సంబంధించిన అభ్యంతరకర పోస్టును పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News