: రేపు అసెంబ్లీ ముట్టడిని ఎవరూ అడ్డుకోలేరు: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
మతపరమైన రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ వ్యతిరేకమని, తెలంగాణ అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ల బిల్లును పెడితే తాము వ్యతిరేకిస్తామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్లుగానే ఆయన రేపు అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. యువమోర్చా ఆధ్వర్యంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ కార్యకర్తలు నిరసన తెలుపుతుంటే పోలీసులు కేసులు పెడుతున్నారని పేర్కొన్న ఆయన.. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపటి అసెంబ్లీ ముట్టడిని ఎవరూ అడ్డుకోలేరని ఉద్ఘాటించారు.