: విరాట్ కోహ్లీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదా?
రాంచీ టెస్టులో గాయపడిన విరాట్ కోహ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ధర్మశాలలో చివరిటెస్టు మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీసులో మునిగిపోయారు. అయితే, అందులో కోహ్లీ మాత్రం కనిపించలేదు. రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తోన్న క్రమంలో కోహ్లీ కుడి భుజానికి గాయం అయి, మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ కూడా చేయలేదు. అయితే, నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ చేసిన కోహ్లీ రెండంకెల పరుగులయినా చేయకుండానే వెనుదిరిగాడు. ఈ రోజు జరిగిన ప్రాక్టీస్‌కి ముందు మైదానంలోకి వచ్చిన కోహ్లీ.. టీమిండియా ఇతర ఆటగాళ్లతో కాసేపు మాట్లాడిన అనంతరం మైదానం నుంచి వెళ్లిపోయాడు. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
All set to begin preparations here in Dharamsala #TeamIndia #INDvAUS pic.twitter.com/KBMEtqIjYe
— BCCI (@BCCI) March 23, 2017