: సిద్ధూ ఆశల మీద నీళ్లు చల్లారు!
పంజాబ్ డిప్యూటీ సీఎం పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ క్రికెటర్ సిద్ధూ చివరకు అంతగా ప్రాధాన్యత లేని శాఖలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సాంస్కృతిక, పర్యాటక, మ్యూజియంల శాఖను సిద్ధూకు కేటాయించారు. మరోవైపు, కపిల్ శర్మ టీవీ షోలో జడ్జిగా కొనసాగాలనుకున్న ఆయన ఆశలపై కూడా నీళ్లు చల్లారు. ఆ కార్యక్రమంలో కొన్నాళ్లు పాల్గొనవద్దని, కొంత కాలం ఆగమని సిద్ధూకు ప్రభుత్వం సలహా ఇచ్చిందట. సాంస్కృతిక శాఖతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండే టీవీ షోలలో పాల్గొనకపోవడమే మంచిదని ప్రభుత్వ న్యాయవాదులు తేల్చేశారట. దీంతో, సిద్ధూకు దిక్కుతోచని స్థితి ఎదురైంది.