: శాసనసభ నుంచి తన ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లిపోయిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మాట్లాడుతూ... ఇటీవల తాను మీట్ ది ప్రెస్ లో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించిన విషయం తెలిసిందే. మీట్ ది ప్రెస్ లో ఆయన చెప్పిన మాటల వీడియో క్లిప్‌ను ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో చూపిస్తున్నారు. అయితే, ఇందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. శాసనసభ నుంచి తమ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బయటకు వెళ్లారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మాత్రమే ఆ వీడియో చూస్తున్నారు.
ఇటీవల జరిగిన మహిళా పార్లమెంటు సందర్భంగా స్పీకర్ శివప్రసాద్ రావు మీట్ ది ప్రెస్ నిర్వహించి మహిళా సాధికారతపై మాట్లాడారు. అయితే, అందులో మహిళా సాధికారతను దెబ్బతీసేలా కోడెల శివప్రసాద్ రావు మాట్లాడారని, వైసీపీ నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అదే వీడియో క్లిప్ చూపిస్తూ తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని కోడెల స్పష్టం చేస్తున్నారు.