: నాడు కోట్లాది మందిని మెప్పించిన 'సూపర్ మారియో'... నేటి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలోకి


సూపర్ మారియో... 1990లలో ఓ వెలుగు వెలిగిన గేమ్. వీడియో గేమ్ పార్లర్లు ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఈ గేమ్ కోట్లాది మందిని అలరించింది. ఇంట్లోని టీవీల్లో సైతం ఈ గేమ్ ను ఆడుకున్నవారి సంఖ్య కోకొల్లలు. స్మార్ట్ ఫోన్ యుగం ప్రవేశించిన తరువాత సూపర్ మారియోను మెల్లగా మరచిపోయారు. గత సంవత్సరం నింటెండో సంస్థ ఇదే గేమ్ ను ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి మార్చి తీసుకురాగా, సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఈ గేమ్ ను నేటి నుంచి ఆండ్రాయిడ్ వర్షన్ లో విడుదల చేసినట్టు సంస్థ తెలిపింది. తొలి నాలుగు రోజుల్లో 4 కోట్ల మందికి, ఆపై ఈ సంవత్సరం జనవరి వరకూ 7.8 కోట్ల డౌన్ లోడ్ లతో సత్తా చాటిన సూపర్ మారియో గేమ్ ను, స్వల్ప మార్పులతో అందుబాటులోకి తెచ్చి, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రీ రిజిస్టర్ ను ప్రకటించింది. గేమ్ డౌన్ లోడ్ కావాలంటే, ఏపీకే మిర్రర్ నుంచి పొందవచ్చని సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News