: ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో ఉరేసుకున్న మహిళ
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు తీసుకుంది. కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ లోని స్టోర్ రూమ్ లో 30 ఏళ్ల వయసున్న ఈ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్వీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని, సూసైడ్ నోట్ లాంటిది కూడా ఘటనా స్థలంలో దొరకలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ఆమె స్టోర్ రూమ్ లోకి ఎలా వెళ్లిందో తెలుసుకుంటామని చెప్పారు.