: అసెంబ్లీలో మంత్రి ప్రత్తిపాటి భార్య పేరు ప్రస్తావించిన జగన్... టీడీపీ తీవ్ర ఆక్షేపణ
అగ్రీగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు ప్రకటన అనంతరం జరిగిన చర్చలో, వైకాపా అధినేత జగన్ మాట్లాడుతూ, బాధితులపై చంద్రబాబు కనీస జాలి, దయ చూపుతారని ఆశించానని, అందరికీ చెల్లింపులు జరిపేందుకు రూ. 1200 కోట్లు కూడా కావని అన్నారు. అగ్రీగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి అగ్రీగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేశారని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు. ఈ సమయంలో జగన్ ప్రసంగానికి తెలుగుదేశం సభ్యులు అడ్డుతగలగా, మంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు. అగ్రీగోల్డ్ సంస్థపై ఎటువంటి ఆరోపణలు రానప్పుడే ఈ డీల్ కుదిరిందని, ఆ ఆస్తితో అగ్రీగోల్డ్ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.