: త్వరలోనే టీఆర్ఎస్ లోకి జానారెడ్డి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి


2019 ఎన్నికలు సమీపించే సమయానికి కాంగ్రెస్ పార్టీలో ఒక్క నేత కూడా మిగలరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ త్వరలోనే కారు ఎక్కుతారని చెప్పారు. ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా దీనికి మినహాయింపు కాదని... ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని అన్నారు. మంత్రి హరీష్ రావు తనకు ఆదర్శమని... ఆయన ఏది చేస్తే, తాను కూడా అదే చేస్తున్నానని చెప్పారు. కానీ, మీడియా ఆయనకు ఇచ్చినంత ప్రచారం తనకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులు తగినంత గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ కూడా సరిగా పాటించడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలకు ఏం తెలుసు? అనే ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News