: ట్రంప్, రష్యా ఏకమై హిల్లరీని ఓడించారు... కీలక ఆధారాలు లభ్యం


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ను ఓడించి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రష్యా అధికారులతో డొనాల్డ్ ట్రంప్ కుమ్మక్కయ్యారనడానికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఓ అంతర్జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రచార సమయంలో హిల్లరీపై పైచేయి సాధించేందుకు రష్యా అధికారులు ట్రంప్ కు సహకరించారని కథనంలో తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు జరిపిన అధికారుల్లో కొందరు ఈ విషయాన్ని ధ్రువీకరించారని వెల్లడించింది. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేందుకు ప్రస్తుతం ఎఫ్ బీఐ సిద్ధమవుతన్నట్టు సదరు పత్రిక పేర్కొంది. రష్యాతో ట్రంప్ కు ఉన్న వ్యాపార సంబంధాలు, ఫోన్ రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ పత్రిక కథనాలను ట్రంప్ కార్యాలయ అధికారులు కొట్టిపారేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News