: త్రిష అనారోగ్యానికి గురైందా?... వివరణ ఇచ్చిన త్రిష తల్లి
ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ అనారోగ్యానికి గురైందన్న వార్త ఆమె అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. త్రిష అనారోగ్యానికి గురైందని, హైదరాబాదులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పుకార్లు షికారు చేశాయి. దీంతో ఆమె అభిమానుల నుంచి హైదరాబాదు, మద్రాసులోని వివిధ పత్రికా కార్యాలయాలకు ఫోన్లు వెల్లువెత్తాయి. త్రిష ఆసుపత్రిలో చేరిందా? అంటూ పలువురు ఆరాతీయడం ప్రారంభించారు. దీంతో మీడియా ప్రతినిధులు త్రిషను సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో ఆమె తల్లి ఉమా కృష్ణన్ ను ఆరాతీయగా...అవన్నీ పుకార్లని, త్రిష క్షేమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె మలేషియాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద స్వామికి జతగా రూపొందుతున్న సతురంగవెట్టై-2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉందని తెలిపారు.