: అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారంపై అసెంబ్లీలో నేడు ప్రకటన?


అగ్రిగోల్డ్ గురించి ప్రతిపక్షం నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆందోళన చేయడంతో అధికార పక్షం స్పందించింది. ఈ మేరకు నేడు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ మృతులకు 3 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప నేడు అసెంబ్లీలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారంపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, కోర్టు విచారణలో ఈ కేసు ఉన్నందున ఆచితూచి స్పందించాలని అధికారపక్షం భావిస్తోంది. బాధితుల తరపున పోరాడాలని ప్రతిపక్షం నిర్ణయించుకుంది. దీంతో నేటి అసెంబ్లీలో అగ్రిగోల్డ్ వివాదం రక్తికట్టనుందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News