: లండన్ లో హై అలెర్ట్... అడుగడుగునా తనిఖీలు


బ్రిటన్ పార్లమెంటు ఎదుట జరిగిన కాల్పుల ఘటనతో లండన్ లో హై అలెర్ట్ ప్రకటించారు. లండన్ లోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు ఎదుట కాల్పులు చోటుచేసుకోవడంతో పార్లమెంటు వాయిదా అనంతరం, పార్లమెంటును మూసివేసిన భద్రతా సిబ్బంది, పార్లమెంటు లోపల కూడా అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతిదానిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో లండన్ లో ఒకరకమైన కట్టుదిట్టమైన భద్రతా వాతావరణం కనిపిస్తోంది. గతంలో బెల్జియం, ఫ్రాన్స్ ఉగ్రదాడుల నేపథ్యంలో లండన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. 

  • Loading...

More Telugu News