: ఐఏఎఫ్ హెలికాప్టర్ గజ్వేల్ మండలంలోని అనంతరావుపల్లిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చెందిన హెలికాప్టర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి సమీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంది. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైందని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. దీంతోనే హెలికాప్టర్ ను అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. హెలికాప్టర్‌ లో ప్రయాణిస్తున్నవారంతా క్షేమంగా ఉన్నారని వారు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని, హెలికాప్టర్‌ లో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసేందుకు నిపుణులు చేరుకున్నారని వారు వెల్లడించారు. కాగా, సమస్యను పరిష్కరించేందుకు మూడు హెలికాప్టర్లలో టెక్నీషియన్స్ రావడం విశేషం. వరుసగా హెలికాప్టర్లు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా గమనించారు. 

  • Loading...

More Telugu News