: ఆ హామీ ఇస్తే.. జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధపడతాడు: జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ పైన, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైన జేసీ వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ఇస్తానని బీజేపీ కనుక హామీ ఇస్తే, జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధపడతాడని, అందులో ఎటువంటి అనుమానం లేదని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.
అయితే, బీజేపీ ఆ విధంగా చేయాలంటే, చంద్రబాబును వదులుకునేందుకు సిద్ధపడాలని .. ఆ విధంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేదనీ జేసీ అన్నారు. జనసేన పార్టీ పరిధి పరిమితంగా ఉందని, దాని నుంచి బయటపడితే గానీ ఆ పార్టీకి భవిష్యత్ ఉండదని అన్నారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కల్యాణ్ నమ్ముకున్నారని జేసీ విమర్శించారు.