: గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధించండి.. జంతు వధ్యశాలల మూసివేతకు ప్రణాళిక వేయండి: యూపీ సీఎం ఆదేశాలు జారీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు ఆదేశాలు జారీ చేస్తూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా మరిన్ని ఆదేశాలు జారీ చేశారు. జంతు వధ్యశాలల (కబేళాలు) మూసివేతకు ప్రణాళిక వేయాలని ఆయన ఈ రోజు పోలీసులకు చెప్పారు. అలాగే గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. తాను జారీ చేస్తోన్న ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు ఆయన అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది.