: ముఖ్యమంత్రి యోగిపై క్రికెటర్ కైఫ్ కామెంట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ కు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శుభాకాంక్షలు తెలిపాడు. యోగి పాలనలో యూపీ అభివృద్ధి పథంలో పయనించాలని... ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించాడు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై అనుమానాలు వ్యక్తం చేయడం మంచిది కాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. 2014 ఎన్నికల్లో ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా కైఫ్ పోటీ చేశాడు. అయితే, మోదీ ఇమేజ్ ముందు క్రికెటర్ గా అతనికున్న ఇమేజ్ పని చేయకపోవడంతో... కైఫ్ ఓడిపోయాడు.