: మమ్మల్ని లోపలే కాదు.. బయట కూడా మాట్లాడనివ్వడం లేదు: వైసీపీ
టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు మండిపడ్డారు. సభలో మాట్లాడటానికి తమకు సమయం ఇవ్వడం లేదని... సభ బయట కూడా తమను మాట్లాడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న తమ మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని అడ్డుకున్నారని అన్నారు. ఈ రోజు తాము మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా, మంత్రి పల్లె రఘునాథరెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు. లోపల, బయట రెండు చోట్లా తమను మాట్లాడనివ్వడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ ఆవరణలో తమకు ప్రత్యేక మీడియా పాయింట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.