: రైతుల గురించి మాట్లాడే నైతిక విలువలు జగన్‌కు లేవు: మంత్రి పల్లె
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రైతుల సమస్యపై ఆందోళన చేయడం పట్ల మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక విలువలు జగన్‌కు లేవని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయనంత రుణమాఫీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిందని అన్నారు. రైతులంతా సంతోషంగా ఉన్నారని, వైసీపీ అనవసర ఆందోళన చేస్తోందని అన్నారు. కరవు మీద కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అన్నారు.. కేంద్ర ప్రభుత్వం సాయం కూడా లేకుండా రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.