: బాత్‌రూంలలోని టిష్యూ పేపర్ల చోరీ.. ఉపాయంతో చెక్ పెట్టిన అధికారులు!


చైనాలోని ‘టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌’ అనే ఒక పర్యాటక ప్రాంతంలో బాత్‌రూంల‌లో ఉన్న టిష్యూ పేపర్లను కూడా చోరీ చేస్తూ చైనీయులు వార్త‌ల్లోకెక్కారు. ప్ర‌తిరోజూ పర్యాటకులతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో నిర్వాహకులు పబ్లిక్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసి, అందులో టిష్యూ పేప‌ర్ల‌ను ఉంచుతున్నారు. బాత్‌రూంలో తాము చోరీ చేస్తే ఎవ్వ‌రూ చూడ‌లేరు క‌దా అని అనుకుంటున్నారేమో.. ఎంచ‌క్కా వాటిని జేబుల్లో పెట్టుకొని తీసుకెళ్లిపోయి, వారి ఇంట్లో అవ‌స‌రాల‌కు వాడుకుంటున్నారు. దీంతో నిర్వాహకులకు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

చివ‌ర‌కు నిర్వాహ‌కులు ఒక ఉపాయం ఆలోచించి, టాయిలెట్స్‌లోని పేపర్‌ రోలింగ్‌ మెషిన్స్‌కు ఫేషియల్‌ స్కానర్స్‌ని ఏర్పాటు చేశారు. స్వల్ప కాలంలో ఒకే వ్యక్తి రెండు సార్లు టిష్యూ పేపర్‌ను తీసుకుంటే ఆ స్కానర్ టిష్యూ పేప‌ర్ల దొంగ‌ని గుర్తిస్తుంది. దీంతో మ‌రో టిష్యూ పేపర్ కోసం ప్ర‌య‌త్నించినా అది బయటకు రాదు. ఈ ఐడియా మంచి ఫ‌లితాల‌నిచ్చింద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News