: ఇదో రకం వైద్యం.. రక్తం పీల్చేస్తూ జలగ చికిత్స!
జలగ మనకు తెలియకుండా వంటిపైకి వచ్చిందంటేనే భయపడిపోతాం. అది రక్తాన్ని పీల్చేస్తుందని ఆందోళన పడతాం. దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ కశ్మీరులో అటువంటి జలగతో వైద్యం చేస్తున్నారు. నొప్పులు, చర్మసంబంధ వ్యాధులతో బాధపడేవారి వంటిపై జలగను ఉంచి, అది రక్తం పీల్చుకునేలా చేసి, చికిత్స చేస్తున్నారు. ఈ చికిత్సా విధానం కొత్తగా వచ్చిందేమీ కాదు. అక్కడ జలగ చికిత్సను వందల ఏళ్ల నుంచి పాటిస్తున్నారు. అవి రక్తాన్ని పీల్చడంతో రక్తప్రసరణ మెరుగవుతుందని స్థానికులు చెప్పారు. తలనొప్పి, గాయాలు వంటివి కూడా నయం అవుతాయని అంటున్నారు.