: పూటుగా మద్యం తాగి.. రైలెక్కి మంత్రికి ట్వీట్ చేశాడు.. కటకటాల పాలయ్యాడు


ఫుల్లుగా మందు కొట్టి రైలెక్కిన ఓ ప్రయాణికుడు రైల్వే మంత్రికి తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా కటకటాల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి బింద్-ఇండోర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలెక్కాడు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతడు రైల్లో విధుల్లో ఉన్న సిబ్బందిపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా బోగస్ ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడి ట్వీట్‌తో అప్రమత్తమైన రైల్వేమంత్రి వెంటనే రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఓ స్టేషన్‌లో ఆగిన రైలెక్కిన ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేసిన ప్రయాణికుడి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే సదరు ప్రయాణికుడు మత్తులో జోగుతుండడంతో అవాక్కయిన ఇన్‌స్పెక్టర్ అతడు చేసింది తప్పుడు ఫిర్యాదు అని గుర్తించారు. ఫిర్యాదు చేసిన సమయంలో పూర్తిగా తాగి ఉన్నట్టు విచారణలో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News