: మరోసారి షాకిచ్చిన కేంద్రం... నగదు లావాదేవీలపై పరిమితి కుదింపు
నల్లధనం నియంత్రణ పేరుతో 2016 నవంబర్ 8 తరువాత బ్యాంకింగ్ లావాదేవీలపై పరిమితులు విధిస్తూ కేంద్రం వివిధ నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి కొనసాగింపుగా నేడు మరొక నిర్ణయం ప్రకటించింది. ఈసారి నగదు లావాదేవీలపై పరిమితిని మరింత కుదించింది. నోట్ల రద్దు సందర్భంగా 3 లక్షల రూపాయల వరకు నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ప్రకటించిన కేంద్రం, ఈ పరిమితిని 2 లక్షల రూపాయలకు కుదించింది. ప్రజలను నగదు రహిత లావాదేవీల దిశగా ప్రోత్సహించడంతో పాటు, ప్రతీ లావాదేవీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే అలా జరిగిన లావాదేవీలపై 100 శాతం జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది.