: మోడల్, టీవీ యాంకర్ ఖుష్బూ భట్ ఆత్మహత్య
అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ మోడల్, టీవీ యాంకర్ ఖుష్బూ భట్ (27) బలవన్మరణానికి పాల్పడింది. వర్ధమాన మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ఆమె జోధ్‌పూర్ లోని సుకృత్ టవర్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అలజడి రేపుతోంది. ఆ టవర్స్‌లో తన తండ్రి మనీష్ (59), అమ్మమ్మ(92)లతో కలిసి ఆమె ఉంటుందని పోలీసులు తెలిపారు. మొన్న మధ్యాహ్నం భోజనం చేసిన ఆమె.. అనంతరం ఈ ఘటనకు పాల్పడిందని చెప్పారు. అయితే, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు కూడా లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.