: మోదీ గ్లోబల్ ఐకాన్... మాకు జాతి, మత, వర్గ విభేదాలు లేవు: లోక్ సభలో యూపీ సీఎం ఆదిత్యనాథ్


దేశంలో పేద, బలహీన వర్గాలకు సేవ చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. లోక్ సభలో ఎంపీగా ఆయన మాట్లాడుతూ, తమ తొలి ప్రాధాన్యం రైతులేనని అన్నారు. ఒకప్పుడు బ్యాంకు ఖాతా కావాలంటే 500 రూపాయలు అవసరమయ్యేదని, జన్ ధన్ ఖాతాల ద్వారా జీరో అకౌంట్ ఖాతాలు తెరిచిన ఘనత ప్రధానిదని ఆయన అన్నారు. అలాంటి కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోదీ గ్లోబల్ ఐకాన్ గా మారారని అన్నారు. దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని ఆయన చెప్పారు.

గోరఖ్ పూర్ కు ప్రధాని ఎయిమ్స్ ఇచ్చారని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా తెలిపారు . దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రపంచం మొత్తం మోదీని గమనిస్తోందని ఆయన చెప్పారు. అభివృద్ధి తమ మతమని ఆయన చెప్పారు. తమకు కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేవని ఆయన చెప్పారు. లోక్ సభ నుంచి తాను ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నానని అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు కూడా మంజూరు చేయలేదని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News