: రామ మందిర నిర్మాణానికి ముస్లింలు వ్యతిరేకం కాదు: మత గురువు మౌలానా ఖలీద్ రషీద్


రామ మందిర నిర్మాణానికి సంబంధించి పిటిషనర్లు, బాధ్యులు అందరూ కోర్టు బయటే చర్చించుకుని, ఓ పరిష్కారానికి రావాలని సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. కోర్టు సూచనను ప్రఖ్యాత ముస్లిం మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగీ మహలి స్వాగతించారు. కోర్టు బయట సమస్యను పరిష్కరించుకోవాలన్న సుప్రీం సూచనను తాము గౌరవిస్తున్నామని తెలిపారు. భారతీయ ముస్లింలు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని చెప్పారు. కాకపోతే ఇది చాలా సున్నితమైన అంశమని... గతంలో కూడా ఈ అంశంపై చర్చించామని, కానీ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో ఆ సమస్య పరిష్కారం కాలేకపోయిందని తెలిపారు.

ఈ అంశంపై సీనియర్ మత పెద్దలతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మౌలానా ఖలీద్ తెలిపారు. తుది తీర్పును సుప్రీంకోర్టు మాత్రమే ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News