: శశికళ వర్గం నుంచి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గంలో చేరిన‌ ప్రముఖ న్యూస్‌ యాంకర్‌, సినీనటి


తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు రావడంతో, ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వేరే పార్టీ పెట్టుకున్న విష‌యం తెలిసిందే. కాగా, పన్నీర్‌సెల్వం వర్గంలోకి వ‌స్తోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌గా ఉన్న మధుసూదనన్‌, కొందరు మంత్రులు, సీనియర్‌ నేతలు పన్నీర్ వ‌ర్గంలో కొన‌సాగుతున్నారు. పన్నీర్‌కు మద్దతు తెలుపుతున్న‌ట్లు దీపా జయకుమార్‌ స్థాపించిన రాజకీయ వేదికకు చెందిన తిరుచ్చి మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ నిన్న‌ ప్రకటించగా, ఈ రోజు ప‌న్నీర్ వ‌ర్గంలోకి మ‌రొక‌రు వ‌చ్చారు. ఇన్నాళ్లూ శ‌శిక‌ళ‌ వర్గానికి మద్దతుదారుగా ఉన్న ప్రముఖ న్యూస్‌ యాంకర్‌, సినీనటి నిర్మలా పెరియస్వామి పన్నీర్‌ వర్గంలో చేరారు.

  • Loading...

More Telugu News