: నేనిచ్చే పంచ్ ల కంటే మా ఆవిడ పంచ్ లే చాలా గట్టిగా ఉంటాయి!: అక్షయ్ కుమార్


తన భార్య ఇచ్చే పంచ్ లు తన పంచ్ ల కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే, టీవీఎఫ్‌ సీఈవో అర్నబ్‌ కుమార్‌ తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై అర్నబ్‌ స్పందిస్తూ.. ‘నేను సింగిల్‌. నాకు ఏ యువతైనా అందంగా కనిపిస్తే మీరు సెక్సీగా ఉన్నారు అని కాంప్లిమెంట్‌ ఇస్తా. అది తప్పా?’ అంటూ తన ప్రవర్తనను సమర్ధించుకున్నాడు. దీనిపై  రచయిత్రి, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా ట్విట్టర్‌లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘పడక గదిలో యువతిని సెక్సీగా ఉన్నావు అని చెప్పొచ్చు. కానీ పని చేసే చోట ఓ అమ్మాయిని సెక్సీగా ఉన్నావు అనడం సమంజసం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తలను రసాయంలో ముంచి కోసేయాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించింది. ఈ ట్వీట్ కు ఆమె అభిమానులతో పాటు, అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి కూడా మంచి మద్దతు లభించింది. దీనిని రీ ట్వీట్ చేసిన అక్షయ్ కుమార్ సినిమాల్లో తానిచ్చే పంచ్ ల కంటే తన భార్య ఇచ్చే పంచ్ లు చాలా గట్టిగా ఉంటాయని పేర్కొన్నాడు.


  • Loading...

More Telugu News