: అనిత మాట్లాడుతుండగా అసహనంతో తల ఊపిన జగన్!
వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత విమర్శించారు. వైసీపీ నేతలకు మహిళల గురించే మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని ఆమె మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ధర్నా చేసిన వీరా మహిళల గురించి మాట్లాడేది? అని విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ పై ఆమె విరుచుకుపడ్డారు. మహిళా సభ్యులను ముందు పెట్టి చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారంటూ విమర్శించారు. అనవసర ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు, అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో అనిత మాట్లాడుతున్న సమయంలో అసహనంతో జగన్ తల అటూఇటూ ఊపడం గమనార్హం.