: అక్కడికెళితే 1231 మోడళ్లకు చెందిన పాత ఫోన్లను చూడవచ్చు!
మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు వస్తున్నాయి. దీంతో ఒకప్పుడు మార్కెట్లో ఎంతో ఆదరణ కలిగిన ఫోన్లు కనుమరుగవుతున్నాయి. అలాంటి ఎన్నో ఫోన్లను ఇప్పుడు మనం చూడడం కష్టమే. అయితే, స్లోవేకియాలోని డాబ్‌సినా నగరానికి చెందిన స్టీఫెన్(26) విభిన్న రీతిలో ఆలోచించాడు. దాంతో పాత ఫోన్ల మ్యూజియం పెట్టేశాడు. అతడి వద్ద ఉన్న పాత ఫోన్ల మోడల్స్ అన్నీ ఇన్నీ కావు. ఏకంగా 1231 మోడళ్లకు చెందిన 3500 పాత ఫోన్లు ఉన్నాయి మరి. పదిహేనేళ్ల వయసు నుంచీ ఇలా పాత ఫోన్లను సేకరించడం మొదలుపెట్టాడు. ఒకేసారి వేయి పాతఫోన్లను కూడా కొన్నాడు. ఒకప్పుడు యూజర్లు ఎంతగానో ఇష్టంగా వాడిన ఫోన్లను ఇప్పుడు ఆ మ్యూజియంలో మనం చూడవచ్చు.