: కేన్సస్ దాడిలో తెలుగు వారిని కాపాడే ప్రయత్నం చేసిన అమెరికన్ కు సత్కారం


అమెరికాలోని కేన్సస్ పట్టణంలో ఇద్దరు భారతీయులను దాడి నుంచి రక్షించే క్రమంలో తీవ్ర గాయాల పాలైన అమెరికా పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ ను భారతీయ సంఘాలు ఘనంగా సత్కరించనున్నాయి. తమ ఉద్యోగాలను భారతీయులు తన్నుకుపోతున్నారన్న అక్కసుతో కేన్సన్ లో తెలుగు వ్యక్తులు కూచిభొట్ల శ్రీనివాస్ తో పాటు అలోక్ అనే మరో యువకుడిపై ఓ అమెరికన్ కొన్ని రోజుల క్రితం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో శ్రీనివాస్ అప్పుడే ప్రాణాలు కోల్పోయాడు. అలోక్ గాయపడ్డాడు.

ఈ దాడికి పాల్పడిన అమెరికన్ ను ఇయాన్ గ్రిల్లాట్ నిలువరించే ప్రయత్నం చేయగా, అతడు సైతం తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇయాన్ ను గౌరవించాలని భారతీయ సంఘాలు నిర్ణయించాయి. హ్యూస్టన్ లో ఈ నెల 25న జరిగే ఓ కార్యక్రమంలో ఇయాన్ ను ‘ఎ ట్రూ అమెరికన్ హీరో’ బిరుదుతో గౌరవించనున్నారు.

  • Loading...

More Telugu News