: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కొనసాగుతున్న కౌంటింగ్


ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర (విశాఖపట్నం) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి 2,633 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక పశ్చిమ రాయలసీమలో వైెసీపీ అభ్యర్థి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి 3,900 ఓట్ల మెజారిటీతో ముందున్నారు.

ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడిపై 3,545 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, టీడీపీ అభ్యర్థి బచ్చలపుల్లయ్యపై విజయం సాధించారు.

  • Loading...

More Telugu News