: ఆ ప్రాజెక్టుపై భార‌త్ అపోహ‌లు వీడాలి... పునరాలోచించుకోవాలి: చైనా


వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ (ఓబీఓఆర్‌) ప్రాజెక్టుపై భారత్ తీరుపట్ల చైనా మీడియా పలు వ్యాఖ్యలు చేసింది. భారత్‌ తన అభిప్రాయాన్ని పునరాలోచించుకోవాలని సూచించింది. ఆ దేశ ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌టైమ్స్ లో ఈ అంశం గురించి ప్ర‌స్తావిస్తూ.. ప్రపంచదేశాలన్నీ ఓబీఓఆర్‌ ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని అనుకుంటున్నాయ‌ని, అయితే భారత్‌ మాత్రం ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ప్ర‌శ్నించింది.

తాము నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు యూఎన్‌ మద్దతు కూడా ఉందని ప‌త్రిక‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై భార‌త్ అపోహ‌లు వీడాల‌ని చెప్పింది. గ‌తంలో తాము చేపట్టిన ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ)ను అమెరికా వ్యతిరేకించి పొరబాటు చేసిందని పేర్కొన్న గ్లోబ‌ల్‌టైమ్స్ ప‌త్రిక, ఇప్పుడు అటువంటి తప్పునే భార‌త్ కూడా చేస్తోంద‌ని పేర్కొంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారీగా పెట్టుబడులు రావడం భార‌త్‌ను ఆందోళనలకు గురిచేస్తోందని, అయితే సాధారణ పెట్టుబడులకు, కమర్షియల్‌ పెట్టుబడులకు తేడాను భారత్‌ గుర్తించాలని చైనా ప‌త్రిక హిత‌వు ప‌లికింది.

  • Loading...

More Telugu News