: చంద్రబాబు 25 లక్షల విరాళం పంపించారు... రేపు దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహిస్తాం!: టీటీడీ జేఈవో


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 25 లక్షల రూపాయలు విరాళంగా పంపించారని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ, రేపు లోకేష్ కుమారుడైన దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబునాయుడు 25 లక్షల విరాళమిచ్చారని అన్నారు. దీంతో రేపు మంగళవారం దేవాన్ష్ పేరిట టీటీడీ అన్నదానం నిర్వహించనుందని ఆయన చెప్పారు. మనవడి పుట్టిన రోజును పురస్కరించుకుని తిరుమలలో ఒకరోజు అన్నదానంకయ్యే ఖర్చును భరించాలని గతంలో నిర్ణయించారని, ఆమేరకు ఆయన ఈ మొత్తాన్ని పంపించారని ఆయన వెల్లడించారు. రేపు తిరుమలలో భక్తులు దేవాన్ష్ పుట్టినరోజు అన్నదానాన్ని ప్రసాదంగా స్వీకరించనున్నారు. 

  • Loading...

More Telugu News