: ప్రభుత్వ బంగ్లా వద్దన్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రభుత్వ సదుపాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాదల్ కు ప్రభుత్వం తరపున బంగ్లాను కేటాయించాలని కొత్త సీఎం అమరీందర్ సింగ్ భావించారు. అయితే, తనకు ప్రభుత్వ బంగ్లా వద్దని బాదల్ చెప్పారు. బంగ్లా ఇవ్వాలనుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నానని బాదల్ తెలిపారు. చండీగఢ్ లోని సెక్టార్ 9లో బాదల్ కు 1.5 ఎకరాల్లో సొంత నివాసం ఉంది. అయితే ఇటీవల దాన్ని కూల్చేశారు. దీంతో, సెక్టార్ 8లో మరో ఇంటి కోసం ఆయన వెతుకుతున్నారు.