: వీడిన ఉత్కంఠ.. బలపరీక్షలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ విజయం
మణిపూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయినప్పటికీ ఇతర పార్టీల సాయంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నంగ్ తొంబన్ బీరేన్ సింగ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొని గెలిచారు. శాసనసభలో మొత్తం 33మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. ఆ రాష్ట్రంలో 60 స్థానాలకు గాను జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, ఎల్‌జేపీ,టీఎంసీ మద్దతును బీజేపీ పొందడంతో బీజేపీ సర్కారు ఏర్పాటయింది.