: మరో రూ. 2 కోట్లు ఖర్చు పెట్టివుంటే ఫలితం మారేది: వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ
రాయలసీమలో ఎన్నికలు జరిగిన మూడు చోట్లా వైకాపా పరాజయం పాలవడంపై ఈ ఉదయం అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాయలసీమలో కనీసం ఒక్క చోటైనా తాము గెలుస్తామని గట్టిగా అనుకున్నామని, అధికార తెలుగుదేశం పార్టీతో సమానంగా తాము డబ్బులను ఖర్చు పెట్టలేకపోయామని, ఓటమికి అదే కారణమని కొందరు ఎమ్మెల్యేలు వాపోయారు. నెల్లూరు స్థానంలో మరో రూ. 2 కోట్లు ఖర్చు చేసి వుంటే, వైకాపాకు అనుకూల ఫలితం వెలువడి వుండేదని చెప్పారు. కడపలో వైఎస్ వివేకా ఓడిపోతారని అనుకోలేదని, ఆయన ఓటమి తమకు తీవ్ర నిరాశను కలిగించే అంశమేనని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.