: బీజేపీ నిజ స్వరూపం బయటపడింది!: యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ఎంపికపై అసదుద్దీన్ ఒవైసీ


ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ను నియమించడం ప‌ట్ల ఏఐఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిప‌డ్డారు. ఈ తీరు లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఈ రోజు ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టిస్తూ మీడియాతో మాట్లాడుతూ... బాధ్యతలు చేపట్టాక మతరాజకీయాలకు చెక్ పెడతానని న‌రేంద్ర మోదీ గ‌తంలో అన్నార‌ని, అయితే, ఇప్ప‌టి పరిస్థితులు అలా కనిపించడం లేదని చెప్పారు. ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెడుతోందని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News