: బాహుబలి-2 హవా... 96 గంటల్లో 8.5 కోట్లకు పైగా వ్యూస్


ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 సినిమా ట్రైల‌ర్ యూ ట్యూబ్ దుమ్ముదులిపేస్తోంది. గురువారం ఉదయం ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల ట్రైల‌ర్‌ల‌ని విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ట్రైల‌ర్ విడుద‌లైన రోజే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అత్య‌ధిక వ్యూస్ సాధించిన బాహుబ‌లి-2 ట్రైల‌ర్.. అదే హ‌వా కొన‌సాగిస్తోంది. అన్ని భాష‌ల్లో క‌లిపి 96 గంటల్లో 8.5 కోట్లకు పైగా వ్యూస్ సాధించి త‌న‌కు తిరుగులేద‌నిపించుకుంది. ఈ విష‌యంపై స్పందించిన బాహుబలి బృందం ఈ ట్రైల‌ర్‌ను విజయవంతం చేసిన అభిమానుల‌కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. కాగా, ఈ నెల 25న ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది.


  • Loading...

More Telugu News