: కడప ఓటర్లకు ఇంత కాలానికి స్వేచ్ఛ... వైసీపీ పతనం మొదలైంది: కళా వెంకట్రావు
కడప ప్రాంతంలో ఇంతకాలం కొనసాగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ చరమగీతం పాడిందని, తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి విజయం సాధించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక కడపలో సైతం అభివృద్ధి దూసుకుపోతుందని చెప్పిన ఆయన, ఈ ప్రాంతంలో వైఎస్ కుటుంబానికున్న పరపతితో పాటు, వైసీపీ పతనం సైతం ప్రారంభమైందని ఆయన అన్నారు. కడపను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు నూటికి నూరు శాతం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాయలసీమలోని 3 సీట్లనూ తెలుగుదేశం గెలుచుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కళా వెంకట్రావు అన్నారు.