: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్.. వైసీపీకి శరాఘాతం


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ దూసుకుపోయింది. మండు వేసవిలో ఫ్యాన్ తిరగలేకపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వాకాటి నారాయణ రెడ్డి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై ఆయన 56 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కడపలో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి ఓటమిపాలయ్యారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి 38 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాయలసీమ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News