: మణిపూర్ లో ఏం జరిగేనో... నేడు బీజేపీకి పెద్ద పరీక్ష!


ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీట్లు లేకున్నా, చిన్న పార్టీల సాయంతో మణిపూర్ లో పగ్గాలు చేజిక్కించుకున్న బీజేపీ నేడు అతిపెద్ద పరీక్షను ఎదుర్కోనుంది. బీజేపీ తరఫున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నంగ్ తొంబన్ బీరేన్ సింగ్ నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. మొత్తం 60 మంది శాసన సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో 24 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్షలో గెలిచేందుకు 31 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కాగా, ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఎల్జేపీ సభ్యుల మద్దతుతో పాటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే మద్దతు బీజేపీకి ఉంది. కాంగ్రెస్ సైతం తమకు వీలైనంత మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు చూస్తున్నట్టు వార్తలు వెలువడటంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News