: వైయస్ వివేకా ఓటమి... తీవ్ర నిరాశలో వైకాపా, ఉత్సాహంలో టీడీపీ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దూసుకుపోతోంది. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో, ఏకంగా వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి ఓటమిపాలు కావడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆయనపై బీటెక్ రవి విజయదుందుభి మోగించారు. దీంతో, జగన్ జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది.
జగన్ సొంత జిల్లా కావడంతో వైసీపీ శ్రేణులు ఇక్కడ విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. అయినా, ఫలితం దక్కకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. మరోవైపు, ఈ అద్భుత విజయంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. చంద్రబాబు పాలనకు ఫలితమే ఈ విజయం అని వారు అంటున్నారు. ఈ విజయంలో కడప జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.