: రెండో రౌండులో అనూహ్యంగా దూసుకొచ్చిన బీటెక్ రవి... వివేకాపై 4 ఓట్ల ఆధిక్యం
కడప స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతోంది. తొలి రౌండులో వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకా ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండు ముగిసేసరికి తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి అనూహ్యంగా దూసుకొచ్చారు. రెండో రౌండ్ ఫలితాల ప్రకారం, వివేకాపై 4 ఓట్ల ఆధిక్యంతో ఆయన ఉన్నారు. ఇక్కడ పోరు తీవ్రంగా ఉండటంతో, ప్రతి ఓటునూ అధికారులు నిశితంగా పరిశీలించి గణిస్తున్నారు. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు వివేకా, బీటెక్ రవిలు లెక్కింపు కేంద్రంలోనే ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.