: కర్నూలు కూడా టీడీపీదే... శిల్పా గెలుపు


కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై, శిల్పా 64 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీపై నెలకొన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందని వైకాపా భావించినప్పటికీ, అది వాస్తవ రూపం దాల్చలేదని ఈ ఫలితాలు వెల్లడించాయి. కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉండి లెక్కింపును పరిశీలించిన శిల్పా, తన విజయానంతరం కార్యకర్తలతో చేతులు కలుపుతూ, ఆనందంగా కనిపించారు.

  • Loading...

More Telugu News