: ప్రారంభమైన కడప కౌంటింగ్... ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి వివేకా... కర్నూలు కోటలో పాగాకు సిద్ధమైన శిల్పా
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కన్నా ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఫిరాయింపుల అనంతరం తెలుగుదేశానికి బలం ఉన్నప్పటికీ, క్రాస్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందని వైకాపా నమ్ముతూ వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబానికి కంచుకోటలా ఉన్న కడప ప్రాంతంలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగగా, ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు సైతం క్రాస్ ఓటింగ్ జరిగినట్టు సూచిస్తున్నాయి. ఇక కర్నూలు విషయానికి వస్తే, తెలుగుదేశం అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.