: ప్రధాని చెవిలో ములాయం గుసగుస.. శ్రద్ధగా విన్న మోదీ!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రధాని నరేంద్రమోదీ చెవిలో గుసగుసలాడడం అందరినీ ఆకర్షించింది. ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలు ఇలా గుసగుసలాడుకోవడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ములాయం సింగ్ యాదవ్ సహా ఆయన కుమారుడు, మాజీ ముఖమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఇద్దరు కలిసి ప్రధాని వద్దకు వెళ్లి పలకరించారు. అఖిలేశ్‌కు మోదీ షేక్‌హ్యాండ్ ఇచ్చి భుజం తట్టారు. ఈ సందర్భంగా ములాయం ప్రధాని మోదీ చెవిలో ఏదో గుసగుసగా చెప్పడం, ఆయన జాగ్రత్తగా వినడం కనిపించింది. ములాయం ఏం చెప్పి ఉంటారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

  • Loading...

More Telugu News