: నాకు ఏమీ కొనేవారు కాదుకానీ, మనవడి కోసం మాత్రం చాలా కొంటున్నారు!: నారా లోకేశ్


'మా నాన్న నాకేమీ కొనిపెట్టలేదు కానీ, మనవడి కోసం చాలా కొంటుూఉంటార'ని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన చిన్నతనంలో తన తండ్రి ఏం కొని తెచ్చేవారు కాదని, అన్నీ, తన తల్లి భువనేశ్వరే చూసుకున్నారని చెప్పారు. ఇప్పుడు మాత్రం, తన మనవడు దేవాన్ష్ కోసం బొమ్మలు, దుస్తులు చాలా కొంటున్నారని అన్నారు. ఎక్కడికైనా వెళితే, తన మనవడి కోసం ఆయన రెండు గంటలకు పైగా షాపింగ్ చేస్తారని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News