: యూపీ సీఎం ఆదిత్యనాథ్ ముస్లిం, దళిత వ్యతిరేకి: సీపీఎం నేత సీతారాం ఏచూరి


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముస్లిం, దళిత వ్యతిరేకి అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన సీతారాం ఏచూరి మాట్లాడుతూ, దళితులపై ఆర్ఎస్ఎస్, గోరక్షక దళాలు దాడులకు దిగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తున్నామని, ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుతామని, ప్రజా ఉద్యమాలు బలపరుస్తామని అన్నారు. ‘జై భీమ్’, ‘లాల్ సలామ్’ కలిసి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’గా మారతాయని, సామాజిక న్యాయం నినాదంపైనే ఇకపై వామపక్షాల ఉద్యమాలు కొనసాగుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News