: ఐశ్వర్యారాయ్ తండ్రికి కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ తండ్రి కృష్ణారాజ్ రాయ్ అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ముంబయిలోని వీల్ పార్లే సేవా సంస్థాన్ లో నిన్న రాత్రే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, కునాల్ కపూర్, రణ్ ధీర్ కపూర్, సోనాలి బింద్రే, ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.